Home  »  TV News  »  పర్సనల్ లైఫ్‌లో కన్నీళ్లు.. అవినాష్, సునయనల గుండెల్ని పిండేసే గాథ!

Updated : Jul 7, 2026

బుల్లితెర మీద  తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ అవినాష్, పర్సనల్ లైఫ్ లో తాను ఎదుర్కొన్న  విషాదకరమైన సంఘటనను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. తన తొలి బిడ్డను కోల్పోయిన సమయంలో అనుభవించిన వేదన గురించి రీసెంట్ గా ఒక షో ప్రోమోలో చెప్పాడు.  కాకమ్మ కథలు  ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఆ ఎపిసోడ్ కి సునయన , అవినాష్ వచ్చారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే   వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో కోల్పోయిన మొదటి బిడ్డలా గురించి చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు.

హోస్ట్ తేజస్విని  "మీ జీవితంలో మీరు ఎప్పటికీ మర్చిపోలేని బాధ ఏదైనా ఉందా  ? " అని అడిగింది . దీనికి ముందుగా స్పందించిన సునైనా, తన తొలి బిడ్డను కోల్పోయిన విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలీదని చెప్పింది.   ఆ ఘటనను ఇప్పటికీ మరచిపోలేకపోతున్నానని, కొన్ని రాత్రుల్లో ఎవరో తనను కాపాడమని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుందని చెబుతూ భావోద్వేగానికి గురైంది.

తర్వాత  అవినాష్ కూడా తన జీవితంలో అలాంటి ఒక  బాధాకరమైన రోజును గుర్తు చేసుకున్నాడు. తొలి బిడ్డను కోల్పోయినప్పుడు  తాను అనుభవించిన మానసిక వేదన గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు .. "ఆ రోజు హాస్పిటల్‌లో డాక్టర్లు, నర్సులు అందరి కాళ్లు పట్టుకుని మా బిడ్డను ఎలాగైనా కాపాడాలని వేడుకున్నాను. పిచ్చివాడిలా హాస్పిటల్ అంతా అటూ ఇటూ తిరిగాను. ఆ బాధను తట్టుకోలేక ఉప్పల్ రోడ్డుపై మట్టిలో పడి  దొర్లాను" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సమయంలో కొద్ది రోజుల పాటు ఇంటి నుంచి కూడా బయటకు రాలేకపోయానని చెప్పాడు. ఈ విషాదం జరిగిన కొన్నాళ్ళు అవినాష్ జోడికి  అద్వైత్ పుట్టాడు. రీసెంట్ గా ఆ పిల్లాడి  ఫస్ట్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కూడా నిర్వహించుకున్నారు.  

అవినాష్ బుల్లితెర మీద నవ్వులు పండిస్తూ ఉంటాడు. సునయన అటు సిల్వర్ స్క్రీన్ మీద ఇటు స్మాల్ స్క్రీన్ మీద మరో వైపు సోషల్ మీడియాలో నవ్వులు పండిస్తూ ఉంటుంది. రకరకాల ఫ్రస్ట్రేషన్ వీడియోస్ చేస్తూ నవ్విస్తూ ఉంటుంది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో సునయన నటించింది. ఇండస్ట్రీలోకి ఈమె మనసు మమతా అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అమ్మోరు మూవీతో మంచి పేరొచ్చింది. అలా ఇండస్ట్రీలో రకరకాల రోల్స్ లో నటిస్తోంది సునయన.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.